గంట మోగించనున్న మమత, హసినా


Fri,November 8, 2019 11:52 PM

కోల్‌కతా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈనెల 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలయ్యే రెండో టెస్టుకు బంగ్లా ప్రధాని షేక్ హసినా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు. తొలి రోజు ఆట ఆరంభానికి ముందు వీరిద్దరు గంట మోగిస్తారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కార్యదర్శి అభిషేక్ దాల్మియా శుక్రవారం పేర్కొన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారత్ తొలిసారి గులాబీ బంతితో ఆడుతున్న ఈ టెస్టును బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్, అభినవ్ బింద్రా, సానియా, సింధు, మేరికోమ్‌ను ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించనున్నారు.

356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles