కృష్ణ ప్రియకు కాంస్యం


Mon,October 21, 2019 03:47 AM

sri-krishna-priya
కైరో (ఈజిప్ట్‌): తెలంగాణ యువ షట్లర్‌ కుదరవల్లి శ్రీకృష్ణ ప్రియ ఈజిప్ట్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో కాంస్య పతకం చేజిక్కించుకుంది. మ హిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ గా బరిలోదిగిన కృష్ణ ప్రియ సెమీఫైనల్లో 16-21, 11-21తో రెండో సీడ్‌ జోర్డాన్‌ హర్ట్‌ (వేల్స్‌) చేతిలో ఓడి కాంస్యం కైవసం చేసుకుంది. అంతకుముందు తొలిరౌండ్‌లో కృష్ణ ప్రియ 21-6, 21-6తో సోహల్లాలి అబ్డెల్మాగిడ్‌ (ఈజిప్ట్‌)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆ తర్వాత రెండో రౌండ్‌లోనూ 21-10, 21-13తో యాస్మిన్‌ చిబా (అల్జీరియా)ను ఓడించి క్వా ర్టర్స్‌కు చేరింది. క్వార్టర్స్‌లో కృష్ణ ప్రియ 21-10, 21-19 తేడా మూడో సీడ్‌ దొరియాస్‌ అజోక్‌ అడేసొకన్‌ (నైజీరియా) పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత అన్‌సీడెడ్‌ ద్వయం కుహూ గార్గ్‌-ధ్రువ్‌ రావత్‌ టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో గార్గ్‌-రావత్‌ జంట 21-16, 22-20తో మన దేశానికే చెందిన మూడో సీడ్‌ ఉత్కర్ష్‌-కరిష్మా జోడీపై నెగ్గింది.

235

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles