ఢిల్లీకి అశ్విన్


Fri,November 8, 2019 02:13 AM

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారబోతున్నాడని వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. కెప్టెన్ అశ్విన్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వదులకుంది. దీని ద్వారా రూ.1.5 కోట్లతో పాటు ఆటగాళ్ల మార్పిడి కింద ఢిల్లీ నుంచి స్పిన్నర్ జగదీశ సుచిత్‌ను పంజాబ్ దక్కించుకుంది. సుచిత్‌తో పాటు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కోసం పంజాబ్ ప్రయత్నించినా సానుకూల ఫలితం దక్కలేదు. ఒప్పందం పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు. అశ్విన్‌తో పాటు ఢిల్లీ హ్యా పీగా ఉంది. మూడు జట్లతో సంప్రదింపుల అనంతరం ఒక ముగింపునకు వచ్చాం అని పంజాబ్ యజమాని నెస్ వాడియా పేర్కొన్నాడు.

447

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles