
భద్రాచలం, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జట్టు 12 ఓవర్లలో 6 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో టోర్నీలో ఓవరాల్ రన్‌రేట్ ఆధారంగా నిర్వాహకులు ఖమ్మం జట్టును విజేతగా ప్రకటించారు. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీఫైనల్లో నల్లగొండ, హైదరాబాద్ పరాజయం పాలయ్యాయి. విజేతలకు టోర్నీ నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.