పంద్రాగస్టు తర్వాతే కోచ్ ఎంపిక!


Sun,August 11, 2019 01:39 AM

న్యూఢిల్లీ: భారత ప్రధాన కోచ్ ఎంపిక ఆగస్టు 15 తర్వాతే జరిగే అవకాశాలున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి వడపోసి అర్హులైన సుమారు ఆరుగురికి ఈ నెల 13, 14వ తేదిల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని ముందు నిర్ణయించినా.. అవసరమైన పత్రాలు సిద్ధంకాని కారణంగా ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామితో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో కోచ్ ఎంపిక జరుగనుండగా.. అందుకు అవసరమైన ప్రాథమిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో కాస్త ఆలస్యమవుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రధాన కోచ్ పదవికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు ఆరుగురిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశాం. వారిని పరీక్షించేందుకు ఒకరోజు సరిపోతుంది. కానీ పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అందుకు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నదిఅని ఆయన తెలిపారు.

285

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles