ఐపీఎల్ వేలం కోల్‌కతాలో


Wed,November 6, 2019 12:16 AM

IPL
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ వేలం వచ్చే నెల 19న కోల్‌కతాలో జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు బెంగళూరు వేదికగా వేలం జరుగగా.. ఈ సారి కోల్‌కతాలో నిర్వహించనుండటం విశేషం. గత సీజన్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద మూడేసి కోట్ల రూపాయలు అదనంగా చేరాయి. దీంతో ప్రతీ జట్టు మొత్తం విలువ రూ. 82 కోట్ల నుంచి 85 కోట్లకు పెరిగింది. ఈసారి వేలంలో ఢిల్లీ , రాజస్థాన్ జట్లకు మాత్రమే మెరుగైన ఆటగాళ్లను దక్కించుకొనే ఆర్థిక వనరులు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం వివరాలు.. ఢిల్లీ క్యాపిటల్స్ (8.20 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (7.15 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (6.05 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (5.30 కోట్లు), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (3.70 కోట్లు), ముంబై ఇండియన్స్ (3.55 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (3.20 కోట్లు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (1.80 కోట్లు).

347

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles