ఢిల్లీకి అశ్విన్!


Wed,November 6, 2019 12:18 AM

ASHWIN
న్యూఢిల్లీ: సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. చాలాకాలం క్రితమే ఈ చర్చ తెరపైకి వచ్చినా.. ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో అనిల్ కుంబ్లే కలువడంతో బదిలీ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. గత రెండు సీజన్లుగా పంజాబ్‌కు నాయకత్వం వహిస్తున్న రవిచంద్రన్‌ను వదులుకోవడానికి తొలుత కుంబ్లే అంగీకరించలేదు. అయితే అశ్విన్‌కు బదులుగా ఇద్దరు యువ ఆటగాళ్లను ఢిల్లీ నుంచి తీసుకునేందుకు పంజాబ్ గతంలోనే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. అవును. అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరనున్నాడు. అశ్విన్‌కు బదులుగా కింగ్స్ జట్టు.. ఢిల్లీ నుంచి ఇద్దరు ప్లేయర్లను పొందింది. ఈ ప్రక్రియ 99 శాతం పూర్తైంది అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే అశ్విన్ స్థానంలో ఢిల్లీ వదులుకున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.

298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles