భారత్‌కు మూడో స్థానం


Tue,August 13, 2019 01:38 AM

football
న్యూఢిల్లీ: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు కోటిఫ్ కప్‌లో మూడో స్థానంలో నిలవడంతో పాటు ఫెయిర్ ప్లే అవార్డు సొంతం చేసుకుంది. వాలెన్సియాలో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు మొత్తం నాలుగు మ్యాచ్‌లాడగా.. అందులో రెండింట నెగ్గి, మరో రెండు ఓడారు. తొలుత భారత్ 3-1తో మౌరిటానియాపై, 7-0తో బొలీవియాపై విజయం సాధించింది. అనంతరం 0-2తో వల్లారియల్, 0-2తోనే స్పెయిన్ అండర్-19 జట్ల చేతిలో ఓడింది. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ విషయం ప్రతీఒక్కరు గుర్తించారు. ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపు సమీపానికి వచ్చాం. ఏడాది కాలంగా జట్టులో చాలా మార్పు కనిపిస్తున్నదిఅని భారత హెడ్ కోచ్ మేమోల్ రాకీ తెలిపాడు.

358

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles