జట్టులోకి మయాంక్, శంకర్


Sun,January 13, 2019 02:00 AM

ముంబై: సస్పెన్షన్‌కు గురైన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు బదులుగా మయాంక్ అగర్వాల్, విజయ్ శంకర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేల్లో వీరిద్దరు జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు.

పాండ్యాకు మరో షాక్!

టీమ్ ఇండియా నుంచి సస్పెన్షన్ వేటు పడిన హార్దిక్ పాండ్యాకు మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో యువ ఆల్‌రౌండర్ బ్రాండ్ విలువ కూడా పడిపోవడం అనుకోని షాక్ కలిగించింది. టాక్ షోలో వ్యాఖ్యలతో జిల్లెట్ సంస్థ పాండ్యాను ప్రచారకర్త హోదా నుంచి తప్పించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే బాట పడితే అతనికి భారీనష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి.

సీవోఏ కమిటీలో విభేదాలు!

పాండ్యా, రాహుల్ టాక్ షో వివాదంపై సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) మరోసారి చీలిపోయింది. ఈ వివాదంపై విచారణను సత్వరమే జరిపించాలని సీవోఏ కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ కోరుతుండగా.. విచారణకు అంత తొందరేం లేదని సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయం వ్యక్తం చేసింది. మీటూ వివాదంలో సత్వర విచారణతో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ బయటపడినట్లుగానే వీరిద్దరికీ క్లీన్‌చిట్ లభించే అవకాశం ఉంటుందని ఆమె హెచ్చరించారు.

362

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles