హాకీ ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ బిడ్


Fri,October 18, 2019 03:19 AM

Hockey
న్యూఢిల్లీ: పురుషుల హాకీ ప్రపంచకప్ (2023) ఆతిథ్య హక్కులు చేజిక్కించుకునేందుకు భారత్ బలంగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే మూడుసార్లు ఈ మెగాటోర్నీని నిర్వహించిన భారత్.. మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు బిడ్ వేసింది. 2023 జనవరి 13 నుంచి 29 మధ్య ప్రపంచకప్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హాకీ ఇండియా (హెచ్‌ఐ).. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కు నివేదిక అందజేసింది. భారత్‌తో పాటు బెల్జియం, మలేషియా కూడా మెగాటోర్నీ ఆతిథ్య హక్కుల కోసం పోటీపడుతున్నాయి. అయితే ఆ రెండు దేశాలు 2022 జూలైలో టోర్నీని నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. మహిళల ప్రపంచకప్ ఆతిథ్యానికి జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, మలేషియా, న్యూజిలాండ్ ఆసక్తి కనబరుస్తున్నాయి. మెగాటోర్నీల నిర్వహణకు పోటీ నెలకొనడం ఆనందదాయకం. ఇది క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుంది. నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఎనిమిది దేశాల మధ్య పోటీ నెలకొంది అని ఎఫ్‌ఐహెచ్ సీఈవో థెర్రీ వైల్ తెలిపారు. నవంబర్ 8న జరిగే ఎఫ్‌ఐహెచ్ తదుపరి సమావేశంలో చర్చించాక ఆతిథ్య దేశాలను ప్రకటించనున్నారు.

206

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles