భారత్ ఒత్తిడి లేదు : శ్రీలంక


Thu,September 12, 2019 04:23 AM

కొలంబో: భారత్ ఒత్తిడి వల్లే లంక సీనియర్ ప్లేయర్లు తమ దేశానికి రావడం లేదంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరీ అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యలను శ్రీలంక క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాం డో కొట్టిపారేశారు. ఆటగాళ్ల బాయ్‌కాట్ వెనుక భారత్ ఒత్తిడి లేదని బుధవారం స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు శ్రీలంక ఆటగాళ్లు వెళ్లకుండా భారత్ ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో నిజం లేదు. 2009 దాడి ఘటన వల్లే కొందరు ప్లేయర్లు ఆ దేశానికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ పాక్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారినే ఎంపిక చేశాం. అయితే బలమైన జట్టునే పంపుతున్నాం. పాక్‌ను వారి దేశంలోనే ఓడిస్తామని నమ్ముతున్నాం అని హరిన్ ఫెర్నాండో ట్వీట్ చేశారు. లసిత్ మలింగ, అంజెలో మాథ్యూ స్, చండీమల్ సహా 10 మంది శ్రీలంక స్టార్‌ప్లేయర్లు పాకిస్థాన్ పర్యటన నుంచి తప్పుకోగా..జట్లను బుధవారం శ్రీలంక బోర్డు ఎంపిక చేసింది. వన్డే జట్టుకు లహిరు తిరిమన్నే, టీ20లకు దసున్ షనక కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles