ఆసియాకప్ నుంచి భారత్ ఔట్


Tue,January 15, 2019 04:31 AM

0-1తో బహ్రెయిన్ చేతిలో ఓడిన ఛెత్రిసేన
foot-ball
షార్జా: భారత ఫుట్‌బాల్ జట్టుకు అనుకోని షాక్.. అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఏఎఫ్‌సీ ఆసియాకప్ ఆడేందుకు అర్హత సాధించిన ఛెత్రిసేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ఏలో భాగంగా బహ్రెయిన్‌తో జరిగిన చివరిలీగ్ మ్యాచ్‌లో 0-1 గోల్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. తొలి లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌పై 4-1 స్కోరుతో విజయం సాధించిన భారత్.. యూఏఈతో జరిగిన రెండో లీగ్‌లో 0-2తో ఓడింది. అయినా ఏఎఫ్‌సీ ఆసియాకప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను గెలిచినా లేదంటే కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ ఆత్మవిశ్వాసంతో బహ్రెయిన్ జట్టును ఢీకొట్టింది. ఆది నుంచి పకడ్బందీ వ్యూహంతో భారత ్రైస్టెకర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినా ఫినిషింగ్ లోపాలతో గోల్ కొట్టలేకపోయారు.

మరోవైపు భారత గోల్‌కీపర్‌గా అడ్డుగోడలా నిలబడి బహ్రెయిన్ ఆటగాళ్ల గోల్ ప్రయత్నాలను వమ్ము చేశాడు. తొలి అర్థభాగం ముగిసినా రెండుజట్లూ గోల్ సాధించలేకపోయాయి. రెండో అర్థభాగంలోనూ ఇరుజట్లూ హోరాహోరీగా పోరాడినా..గోల్ సాధించలేకపోయాయి. మరో నిమిషంలో ద్వితీయార్థం ముగియనుండగా.. బహ్రెయిన్ జట్టుకు లభించిన పెనాల్టీని జమాల్ రషీద్ గోల్ కొట్టడంతో భారత్‌కు శరాఘాతంలా మారింది. ఎక్స్‌ట్రా సమయంలోనూ గోల్ కోసం భారత్ ప్రయత్నించినా బహ్రెయిన్ జట్టు జాగ్రత్తగా ఆడి విజయంతో నాకౌట్ చేరింది. మరోవైపు యూఏఈ, థాయిలాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1స్కోరుతో డ్రాగా ముగిసింది. దీంతో భారత్ మినహా గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లూ నాకౌట్ చేరాయి.

751

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles