మెరుగయ్యేందుకు రోజూ శ్రమిస్తున్నా


Thu,September 12, 2019 04:53 AM

pant
కోల్‌కతా: మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడని అందరూ ఆశిస్తున్న రిషభ్ పంత్ ఇటీవల నిలకడ లేమితో నిరాశపరుస్తున్నాడు. అయితే, అతడి ప్రతిభను దృష్టిలో ఉంచుకొని మరింత సమయం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు. దీంతో, స్వదేశంలో త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నట్టు పంత్ చెప్పాడు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు తన ప్రదర్శనతో పాటు ధోనీతో పోల్చుతుండడంపై మాట్లాడాడు. ఆటను మరింత మెరుగుపరుచునేందుకు ప్రతీరోజు కృషి చేస్తున్నానని పంత్ తెలిపాడు. వెస్టిండీస్ పర్యటనలో జట్టు చాలా బాగా ఆడింది. నన్ను నేను మెరుగుపరుచుకోవాలని పట్టుదలగా ఉన్నా. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఎంతో ప్రాక్టీసు చేశాం. తప్పకుండా బాగా ఆడుతాం. ఈ సిరీస్‌లో అతిథ్య జట్టుగా అనూకూలత ఉంది. దక్షిణాఫ్రికా కూడా మంచి జట్టే అని పంత్ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఈ నెల 15వ తేదీన సఫారీలతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

383

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles