జోరు సాగించాలని..


Wed,November 6, 2019 12:11 AM

HYDERABAD-FC

-ఐఎస్‌ఎల్‌లో నేడు నార్త్‌ఈస్ట్‌తో హైదరాబాద్ ఢీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడా ప్రతినిధి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) అరంగేట్ర సీజన్‌లో రెండు పరాజయాలతో చతికిలపడ్డ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు సొంత గడ్డపై జరిగిన గత మ్యాచ్ విజయాన్ని కట్టబెట్టింది. ఇదే జోష్‌తో నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో బుధవారం తలపడేందుకు ఆతిథ్య జట్టు సిద్ధమైంది. గెలుపే లక్ష్యంగా హైదరాబాద్ ఆటగాళ్లు మంగళవారం ముమ్మర కసరత్తులు చేశారు. జట్టు వ్యూహాలు, ప్రాక్టీస్ తదితర అంశాలను హెడ్‌కోచ్ ఫిల్ బ్రౌన్, స్టార్ ప్లేయర్ మార్కో స్టాంకోవిచ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సొంత మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2-1తేడాతో కేరళను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

80

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles