నా ఫిట్‌నెస్ మరో స్థాయికి


Thu,September 12, 2019 04:45 AM

hardik
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటన నుంచి విశ్రాంతి లభించడంతో తాను ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టినట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కో సం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యానని పేర్కొన్నాడు. ఐపీఎల్, ప్రపంచకప్ లాంటి సుదీర్ఘ టోర్నీలు ఆడాక విశ్రాం తి లభించడం నాకు ముఖ్యం. గాయాలను తట్టుకునేందుకు, నివారించేందుకు నా శరీరాన్ని సిద్ధం చేసుకున్నా. దక్షిణాఫ్రికా సిరీస్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్నా. నా ఫిట్‌నెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు విశ్రాంతి చాలా ఉపయోగపడింది. గత నెల మొత్తం రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేశా. జట్టులోకి మరిం త మెరుగ్గా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించా. నేను లక్ష్యాలు ఎక్కువగా పెట్టుకోను. సన్నాహకాలపై దృష్టిసారిస్తా. అని పాండ్యా చెప్పాడు.

228

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles