గోవా గెలుపు


Fri,November 8, 2019 02:25 AM

GOA
ముంబై : ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో గోవా ఎఫ్‌సీ అదరగొట్టింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో గోవా 4-2తేడాతో ముంబై ఎఫ్‌సీపై విజయం సాధించింది. కార్నర్ కిక్ సాయంతో 27వ నిమిషంలో లెన్నీ రోడ్రిగ్స్ గోల్ చేయడంతో గోవా పైచేయి సాధించింది. తొలి అర్ధభాగం చివరి నిమిషంలో ఫెర్రన్ కొరోమినాస్ మరో గోల్ సాధించడంతో గోవా ఆధిక్యం రెట్టింపైంది. సర్తక్ గౌలీ ( 49వ ని.), సౌవిక్ చక్రవర్తి(55వ ని.) గోల్స్ చేయడంతో ముంబై 2-2తో సమం చేసింది. కాసేపటికే హుగో బౌమస్ (59వ ని.), మ్యాచ్ ముగిసే ఒక్క నిమిషం ముందు కార్లోస్ పెనా మరో గోల్ చేయడంతో గోవా గెలిచింది.

132

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles