గుర్‌ప్రీత్ గోడలా..


Wed,September 11, 2019 03:58 AM

football
ఖతర్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకున్న భారత్

దోహా: భారత ఫుట్‌బాల్ జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మనకంటే ఎంతో మెరుగైన ఖతార్‌ను నిలువరించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. తొలి మ్యాచ్‌లో ఓమన్ చేతిలో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. ఆసియా చాంపియన్, ప్రపంచ 62వ ర్యాంకర్ ఖతార్‌పై మాత్రం చెలరేగి ఆడింది. అనారోగ్యం కారణంగా స్టార్ ప్లేయర్ సునిల్ ఛెత్రీ దూరమైన ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. మ్యాచ్ మొత్తంలో ఖతార్ స్ట్రయికర్‌లు 27 సార్లు దాడులు చేస్తే.. వాటిని సంధు చాకచక్యంగా అడ్డుకున్నాడు. ముఖ్యంగా డజనుకు పైగా షాట్లను పోస్ట్‌కు అతిసమీపంలో అడ్డుకొని ఔరా అనిపించాడు.

398

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles