ద్యుతీ రికార్డు పసిడి


Thu,July 11, 2019 03:03 AM

-వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర
duthee-chand
నపోలీ(ఇటలీ): భారత స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ స్వర్ణంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును 11.32 సెకన్లలో ముగించి యూనివర్సిటీ పోటీల్లో పసిడి పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ద్యుతి రికార్డుల్లోకెక్కింది. ఇదే పోటీలో బరిలోకి దిగిన డెల్ పొంటో(11.33సె), లిసా క్వాయి(11.39సె) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఎనిమిది మంది పోటీపడ్డ రేసులో నాలుగో లైన్ నుంచి పరుగు మొదలుపెట్టిన ద్యుతి..చిరుతను తలపిస్తూ కండ్లు మూసి తెరిసే లోపు గమ్యాన్ని ముద్దాడింది. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన ద్యుతి అనితర సాధ్యమైన రికార్డుతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించిన ద్యుతీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.

223

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles