దీపక్‌కు ఒలింపిక్ బెర్త్


Wed,November 6, 2019 12:29 AM

SHOOTING

-మనూ భాకర్‌కు స్వర్ణం.. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్

దోహా: భారత షూటర్ దీపక్ కుమార్ తన పుట్టిన రోజున అద్భుత ప్రదర్శన చేసి, ఘనమైన బహుమతి పొందాడు. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించిన దీపక్.. టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత 10వ షూటర్‌గా నిలిచాడు. ఎనిమిది మంది పోటీ పడిన తుదిపోరులో 227.8 పాయింట్లతో దీపక్ మూడో స్థానంలో నిలిచాడు. చైనా షూటర్ యుకున్ లీ (250.5) స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత యువ సంచలనం మనూ భాకర్ స్వర్ణ పతకం సాధించింది. 244.3 పాయింట్లతో అగ్రస్థానాన నిలిచి సత్తాచాటింది. 17 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి ఇప్పటికే విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఈ ఏడాది జరిగిన మ్యూనిచ్ కప్ ప్రదర్శనతోనే భాకర్ టోక్యో బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక భాకర్ విభాగంలో గ్విన్ జంగ్ (చైనా), రాంక్సిన్ జింగ్ (చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు చేజిక్కుంచుకోగా.. భారత షూటర్లు యశస్వి సింగ్ దేశ్వాల్ ఆరో స్థానంతో, అన్నూరాజ్ సింగ్ 20వ స్థానంతో సరిపెట్టుకున్నారు. జూనియర్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో వివాన్ కపూర్, మనీశా కీర్ పసిడి పతకాన్ని పట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం పోటీలో భారత త్రయం ఎలవెనిల్ వలరివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చండీలతో కూడిన జట్టు 1883.2 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత షూటర్లకు ఆసియా చాంపియన్‌షిప్ టోర్నీయే చివరి అవకాశం.

202

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles