కామన్వెల్త్‌లో క్రికెట్


Wed,August 14, 2019 01:40 AM

womens-cricket
- మహిళల విభాగంలో టీ20 పోటీలు

మెల్‌బోర్న్/లండన్: కామన్వెల్త్ గేమ్స్‌లో మళ్లీ క్రికెట్ దర్శనమివ్వనుంది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న ఈ క్రీడల్లో తిరిగి క్రికెట్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపాయి. చివరిసారిగా కౌలాలంపూర్ (1998) వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల క్రికెట్‌ను క్రీడాంశంగా చేర్చగా.. అప్పుడు దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఆ తర్వాత క్రీడల జాబితా నుంచి క్రికెట్‌ను తొలగించారు. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా.. తాజాగా సీజీఎఫ్ అంగీకారం తెలిపింది. ఇది చారిత్రాత్మక రోజు. కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు పునఃస్వాగతం పలుకుతున్నాంఅని సీజీఎఫ్ అధ్యక్షుడు మార్టిన్ తెలిపారు. ఇది మహిళల క్రికెట్ విశ్వవ్యాప్తం కావడానికి దోహదపడనుంది. మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశంఅని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నే పేర్కొన్నారు. ఈ క్రీడల్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. అన్నీ మ్యాచ్‌లకు ఎడ్జ్‌బాస్టన్ వేదిక కానుంది.

షూటింగ్‌కు స్పేస్ లేదు..

ఇదిలా ఉంటే కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్‌ను చేర్చేది లేదని సీజీఎఫ్ తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైపోయిందని క్రీడల్లో షూటింగ్‌కు స్థానం లేదని స్పష్టం చేసింది. 1974 నుంచి కొనసాగుతున్న షూటింగ్‌ను రవాణా సౌకర్యాల కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌లో పొందుపర్చలేకపోతున్నామని పేర్కొంది. కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ అనేది తప్పక ఉంచాల్సిన క్రీడాంశం ఏం కాదు. దాని కోసం మేము కూడా ప్రయత్నించాం. ఇప్పుడు అంత స్పేస్ లేదు అని సీజీఎఫ్ అధ్యక్షుడు మార్టిన్ అన్నారు. దీంతో భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అంశాన్ని ఇక ముందు కామన్వెల్త్ క్రీడల్లో చూడటం కష్టమే అని తేలిపోయింది. మరో వైపు ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ బహి ష్కరణకు మొగ్గు చూపింది.

315

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles