సెమీస్‌లో బోపన్న జోడీ


Sun,August 11, 2019 01:43 AM

Rohan
మాంట్రియల్ (కెనడా): ఏటీపీ మాస్ట ర్స్-1000 మాంట్రియల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహాన్ బోపన్న (భారత్)-డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కెనడా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న-షపోవలోవ్ ద్వయం శనివారం బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)-వావ్రింకా (స్విట్జర్లాండ్) జోడీతో తలపడాల్సిఉండగా.. వావ్రింక జంట వాకొవర్ ఇవ్వడంతో ముందడుగు వేసింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట 6-3, 6-4తో కైల్ ఎండ్మండ్ (బ్రిటన్)-టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) ద్వయంపై నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరుగనున్న సెమీఫైనల్లో బోపన్న జంట రాబిన్ హస్సే-వెస్లే కుల్హోఫ్ (నెదర్లాండ్స్)తో తలపడనుంది.

243

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles