ఐదో ర్యాంక్‌కు అండ్రెస్కు


Tue,September 10, 2019 02:19 AM

Bianca
పారిస్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (అమెరికా)ను మట్టికరిపించి యూఎస్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకెళ్లిన కెనడా టీనేజ్ సంచలనం 19 ఏండ్ల బియాంక అండ్రెస్కు డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. సెరెనాను ఓడించక ముందు 15వ స్థానంలో ఉన్న అండ్రెస్కు ఈ గెలుపుతో 10 స్థానాలు మెరుగుపర్చుకొని తొలిసారి టాప్-10లో అడుగుపెట్టింది. ఆష్లే బార్టీ అగ్రస్థానానికి చేరగా.. కరోలినా ప్లిస్కోవా, ఎలినా స్వితోలినా, నవోమీ ఒసాకా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సెరెనా ఒక స్థానం కోల్పోయి 9వ ర్యాంక్‌కు చేరింది. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన రష్యా యువ ఆటగాడు మెద్వదెవ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. జొకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత వరుసగా నాదల్ , ఫెదరర్ ద్వితీయ, తృతీయ ర్యాంక్‌ల్లో ఉన్నారు. భారత యువ ఆటగాడు సుమిత్ నాగల్ కెరీర్‌లో అత్యుత్తమంగా 174వ ర్యాంక్‌కు చేరాడు.

173

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles