పీబీఎల్-4 చాంపియన్


Mon,January 14, 2019 12:19 AM

pbl
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్-4లో బెంగళూరు రాప్టర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం ముంబై రాకెట్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో 4-3 స్కోరుతో విజయం సాధించింది. బెంగళూరు రాఫ్టర్స్ జట్టు కెప్టెన్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో 15-7,15-10 స్కోరుతో రాకెట్స్ ఐకాన్ షట్లర్ ఆంటోన్‌సెన్‌పై గెలిచి జట్టు చాంపియన్‌షిప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇరుజట్లు 3-3 స్కోరుతో సమంగా నిలిచిన దశలో చాంపియన్‌ను తేల్చే కీలక డబుల్స్ మ్యాచ్‌లో మహ్మద్ షాన్, సెతివన్ 15-13,15-10 స్కోరుతో లీయోంగ్ డే, కిమ్ జోంగ్ జోడీపై ఉత్కంఠ విజయంతో రాఫ్టర్స్ జట్టు సంబురాల్లో మునిగింది.

272

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles