సిరీస్‌ ఆసీస్‌దే పింక్‌ టెస్టులో ఇన్నింగ్స్‌


Tue,December 3, 2019 01:43 AM

-48 పరుగులతో పాక్‌ చిత్తు
Australia
అడిలైడ్‌: బ్యాట్స్‌మెన్‌ కనీస ప్రతిఘటన చూపకపోవడంతో ఆస్ట్రేలియాతో జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్టులో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో చేజిక్కించుకుంది. పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఆసీస్‌కు ఇది ఆరో విజయం కాగా.. అందులో నాలుగింటికి అడిలైడ్‌ వేదిక కావడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌ 120 పాయింట్లు చేజిక్కించుకొని మొత్తం 176 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. టీమ్‌ఇండియా (360) టాప్‌లో ఉంది. రెండు టెస్టులు ఆడిన పాకిస్థాన్‌ ఇంకా ఖాతా తెరువలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 39/3తో సోమవారం ఫాలోఆన్‌ కొనసాగించిన పాక్‌.. చివరకు 239 పరుగులకు ఆలౌటైంది. కంగారూ బౌలర్లు లియాన్‌ (5/69), హజిల్‌వుడ్‌ (3/63) ధాటికి మసూద్‌ (68), అసద్‌ షఫీక్‌ (57), రిజ్వాన్‌ (45) మినహా మిగిలినవారు చేతులెత్తేశారు. ట్రిపుల్‌ సెంచరీ హీరో డేవిడ్‌ వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', ‘మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి.

323

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles