ప్రతిభను మెరుగుపరిచేందుకే..


Thu,November 7, 2019 03:46 AM

ashwin
క్రికెట్ అకాడమీ ఆవిష్కరణలో అశ్విన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడాప్రతినిధి: చిన్నారుల్లోని క్రీడాప్రతిభను మెరుగుపరచాలన్న లక్ష్యంతోనే గాడియమ్ స్పోర్టోపియాతో చేతులు కలిపినట్లు టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్, జెన్‌నెక్ట్స్ క్రికెట్ ఇన్‌స్టిట్యూట్ మెంటార్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. హైదరాబాద్ శివారులోని స్పోర్ట్స్ స్కూల్ గాడియమ్ స్పోర్టోపియాలో బుధవారం జరిగిన క్రికెట్ అకాడమీ ఆవిష్కరణ కార్యక్రమానికి అశ్విన్ హాజరయ్యాడు. స్పోర్టోపియా-జెన్‌నెక్ట్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ అకాడమీలో తాను కూడా చిన్నారులకు దిశానిర్దేశం చేస్తానని చెప్పాడు. పుల్లెల గోపీచంద్, ఎస్.రామన్, ఆర్‌బీ రమేశ్ లాంటి దిగ్గజ క్రీడాకారులు భాగస్వాములై ఉన్న స్పోర్టోపియాతో కలవడం తనకు గొప్ప అవకాశమని చెప్పాడు. అంకిత భావం, పట్టుదల కలిగిన అశ్విన్ లాంటి స్టార్‌తో ఒప్పం దం కుదుర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నామని స్పోర్టోపియా వ్యవస్థాపకురాలు కీర్తిరెడ్డి చెప్పారు.

426

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles