రాయుడు అనుమానాస్పద యాక్షన్


Mon,January 14, 2019 12:15 AM

దుబాయ్: భారత క్రికెటర్ అంబటి రాయుడు అనుమానాస్పద బౌలింగ్ చేసినట్లు తేలింది. ఈనెల 12న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేసిన రాయుడు యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. మ్యాచ్‌లో రాయుడు బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను అధికారులు టీమ్ మేనేజ్‌మెంట్‌కు అందించారు. నిబంధనలకు అనుగుణంగా బౌలింగ్ చేశాడా లేదా అన్నది పరీక్షించాల్సి ఉంది. 14 రోజుల్లోపు రాయుడు పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఫలితం వచ్చే లోపు బౌలింగ్‌ను కొనసాగించే అవకాశం అతనికుంటుంది అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. రాయుడు తన 46 వన్డేల కెరీర్‌లో 41.33 సగటుతో మూడు వికెట్లు పడగొట్టాడు.

355

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles