సాట్స్ చైర్మన్‌గా మళ్లీ అల్లిపురం


Thu,November 7, 2019 03:34 AM

sats
మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడా ప్రతినిధి: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) నూతన అధ్యక్షుడిగా అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తిరిగి ఎంపికయ్యారు. గత మూడేండ్లుగా సాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన బుధవారం మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తాచాటడమే లక్ష్యంగా రాష్ట్ర క్రీడాశాఖ పనిచేస్తున్నది. క్రీడల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలువడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. గత మూడేండ్లలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం దక్కడం ఆనందకరం అని అన్నారు. అధ్యక్షుడిగా తనపై నమ్మకముంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

281

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles