పరుగులు చేయలేక..


Fri,October 18, 2019 03:29 AM

-కోపంలో చేయి విరగ్గొట్టుకున్న సఫారీ ఓపెనర్ మార్క్మ్

రాంచీ: భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఎయిడెన్ మార్క్మ్ గాయం కారణంగా చివరి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయా డు. పుణె మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఔటై పెవిలియన్ చేరిన అనంతరం తన ప్రదర్శనతో అసంతృప్తి చెందిన మార్క్మ్ చేతిని డ్రెస్సింగ్ రూమ్ గోడకు బలంగా గుద్దాడు. దీంతో కుడి చేతి ఎముక విరిగింది. ఈ మేరకు క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఔటై పెవిలియన్ చేరిన మార్క్మ్.్ర. తన ప్రదర్శనతో విసుగు చెంది చేతిని గాయపరుచుకున్నాడు. బలమైన గోడను కొట్టడం ద్వారా అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది అని అందులో పేర్కొంది.

598

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles