కర్ణాటకానికి మరో బ్రేక్


Tue,July 23, 2019 03:35 AM

Visuals Of H D Kumaraswamys Alleged Resignation Letter Go Viral On Social Media CM Calls It Forgery

- నేటికి అసెంబ్లీని వాయిదావేసిన స్పీకర్
- సోమవారమూ కొలిక్కి రాని విశ్వాస పరీక్ష
- చర్చను సాగదీసిన అధికార పక్షం
- నేటికి అసెంబ్లీ వాయిదా.. రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసు
- సోషల్ మీడియాలో సీఎం నకిలీ రాజీనామా లేఖ


బెంగళూరు, జులై 22: కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం హెచ్‌డీ కుమారస్వామి సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై సోమవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. అనంతరం స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సభను వాయిదావేశారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు గడువు విధించారు. అయితే రాత్రి ఎనిమిది గంటల వరకు సమయం కావాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సి ఉన్నదని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు చర్చను ముగించి విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు విశ్వాసపరీక్షపై చర్చ జరుగుతున్నప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల భవితవ్యం తేలే వరకు విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని స్పీకర్‌పై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చింది. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే విశ్వాస పరీక్ష మరింత జాప్యం కారాదని స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ విశ్వాస పరీక్ష ప్రక్రియ సోమవారం ముగిస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పదేపదే గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. దయచేసి నన్ను బలి పశువును చేయొద్దు. మనమంతా లక్ష్యానికి చేరుకోవాల్సిందే అని అన్నారు.
Kumaraswamy1
మనం ప్రజా జీవితంలో కొనసాగుతున్నామన్న సంగతి మరిచిపోవద్దని, చర్చల పేరిట సాగదీయవద్దని కూటమి నేతలకు స్పీకర్ హితవు చెప్పారు. మరోవైపు స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిసి ఎలాగైనా సోమవారం విశ్వాస పరీక్ష ముగించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. సభలో అసెంబ్లీలో విపక్ష నేత బీఎస్ యెడ్యూరప్ప మాట్లాడుతూ ఈ రోజు విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరుగాల్సిందేనని చెప్పారు. సీఎం కుమారస్వామి మాట్లాడుతూ తాను రాజీనామా చేసినట్లు బూటకపు రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని స్పీకర్‌కు చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాస పరీక్షపై చర్చను పొడిగించాలని కోరారు. అందుకు స్పీకర్ రమేశ్‌కుమార్ ససేమిరా అని అన్నారు. ఇదిలా ఉంటే విశ్వాస పరీక్ష చేపట్టకుండానే సీఎం కుమారస్వామి రాజీనామాకు సిద్ధపడ్డారని, రాత్రి ఏడు గంటలకు గవర్నర్ వాజుభాయి వాలా అపాయింట్‌మెంట్ కోరినట్టు వచ్చిన ఈ వార్తలను సీఎంవో తోసిపుచ్చింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాలని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేత డీకే శివకు మార్ మాట్లాడుతూ.. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీ కర్ అనర్హత వేటు వేయకుండా బీజేపీ చూస్తున్నదని, వారిని మంత్రులను చేస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నదని, ఒకసారి అనర్హత వేటు పడితే మంత్రులను చేయడం కుదరదన్నారు. మరోవైపు తక్షణం విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరిపేందుకు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనున్నది.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles