సంక్షోభం ముందున్న దారులు!


Thu,July 11, 2019 02:25 AM

Two more Congress leaders opt for the exit route in Karnataka

న్యూఢిల్లీ: తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో సంక్షో భం ముందున్న దారులేంటో చూద్దాం..
1. సంకీర్ణ ప్రభుత్వం మనుగడ13 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో నలుగురు/ఐదుగురు తమ రాజీనామాలను ఉపసంహరించుకుని క్యాబినెట్‌లో చేరితే సంకీర్ణ ప్రభుత్వం నిలబడవచ్చు. ఇది సరిపోకుంటే ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా కాంగ్రెస్, జేడీఎస్ రివర్స్ ఆపరేషన్ చేపట్టవచ్చు.
2. బీజేపీ ప్రభుత్వంఅసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే.. 108 మంది ఎమ్మెల్యేల మద్దతుతో (ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో కలిపి) బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో కూటమి బలం 102కు తగ్గుతుంది. 13 ఖాళీల నేపథ్యంలో, అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సి మెజార్టీ సంఖ్య 106కు తగ్గుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించవచ్చు.
3. సుప్రీంకోర్టు జోక్యంఅసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. వారి రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు కోరే అవకాశం ఉంది. అసెంబ్లీలో బల నిరూపణకూ ఆదేశించవచ్చు.
4. మళ్లీ ఎన్నికలుఅసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరిస్తే రాష్ట్రపతి పాలన విధించేందుకు గవర్నర్ సిఫార్సు చేయొచ్చు. తద్వారా మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది.

312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles