గాంధీలకు ఇక తనిఖీలు తప్పనిసరి

Sun,November 10, 2019 01:53 AM

-వీవీఐపీల జాబితాలోనూ వారిని చేర్చని కేంద్రం
-30 మందితో వీవీఐపీల జాబితా రూపొందించిన బీసీఏఎస్

న్యూఢిల్లీ, నవంబర్ 9: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత ఉపసంహరించడంతో మిగతా ప్రయాణికుల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కొడుకు రాహుల్‌గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ.. విమానాశ్రయాల్లో ముందస్తు తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ముందస్తు తనిఖీల నుంచి 30 మంది అత్యంత ప్రముఖుల (వీవీఐపీ)లు, వారి జీవిత భాగస్వాములను మినహాయిస్తూ పౌర విమానయాన భద్రతా బ్యూరో (బీసీఏఎస్) జాబితా సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక పేర్లను ఇందులో చేర్చలేదు. రాష్ట్రపతి జీవిత భాగస్వామి, మాజీ ప్రధానులకు తనిఖీ నుంచి మినహాయింపు లభించింది. మూడు నెలల క్రితమే ఉపరాష్ట్రపతి జీవిత భాగస్వామి, లోక్‌పాల్ చైర్‌పర్సన్‌లకు మినహాయింపు విస్తరించింది బీసీఏఎస్. ఇంతకుముందు ఎస్పీజీ భద్రత ఉండటంతో సోనియా, రాహుల్, ప్రియాంకలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండేది. ప్రియాంకతో కలిసి ప్రయాణించినప్పుడు ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు కూడా తనిఖీ నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ప్రియాంక ఉన్నా రాబర్ట్ వాద్రా కూడా ముందస్తు తనిఖీలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ముగ్గురికి జడ్-ప్లస్ క్యాటగిరీ కింద సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించినా విమానాశ్రయాల్లో మాత్రం తనిఖీలు చేస్తారు.

1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles