ఆర్థిక మందగమనం నుంచి దృష్టి మరల్చేందుకే..


Thu,September 12, 2019 02:14 AM

PM Modi should be alarmed when people are killed in name of  cow Opposition

ఆవు, ఓం పేరు వింటే కొంతమంది భయపడుతున్నారని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆర్థిక మందగమనం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఓం, ఆవు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆవు ఆర్థికవ్యవస్థ గురించి మోదీ మాట్లాడున్నారు కానీ దేశ ఆర్థికవ్యవస్థ గురించి మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. ప్రతి భారతీయుడు.. దేవాలయాల నుంచి ఓంకారం, భజనలు.. మసీదులు, చర్చిలు నుంచి ప్రార్థనలు వింటారని, అదేమన దేశ గొప్పతనమని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం వంటి విషయాలపై చర్చ జరుగకూడదని మోదీ ప్రజల దృష్టిని మరలుస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆవు, దేవుడి పేర్లతో మూకదాడులు జరుగుతున్న పరిస్థితుల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని సీపీఐ నేత రాజా అన్నారు.

104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles