విదేశాంగశాఖను సుష్మ సంస్కరించారు


Wed,August 14, 2019 01:49 AM

PM Modi recalls first lesson Sushma Swaraj taught him

-సంస్మరణ సభలో ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్‌ పనిచేసినప్పుడు ఆ శాఖను పూర్తిగా మార్చివేశారని, ప్రొటోకాల్‌ ఆధారిత శాఖగా కాకుండా ‘ప్రజల పిలుపు’ ఆధారిత శాఖగా మలిచారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన సుష్మ సంస్మరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. పార్టీలకతీతంగా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో తాను మొదటిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే ముందు, ఆశువుగా మాట్లాడడానికి బదులు సిద్ధం చేసుకున్న ప్రసంగం ద్వారా మాట్లాడాలని సుష్మ తనను అభ్యర్థించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘ఎంత గొప్ప వక్త అయినా గానీ, కొన్ని వేదికల్లో సంప్రదాయాలు పాటించాలి. ఇదే సుష్మ నాకు నేర్పిన తొలి పాఠం’ అని ఆయన పేర్కొన్నారు. సుష్మ హయాంలో దేశంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు 77 నుంచి 505కు పెరిగాయన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా, కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ, జేడీయూ రాజీవ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles