దేశమంతా ఎన్నార్సీఅవసరం లేదు

Tue,January 14, 2020 02:33 AM

-ఎన్పీఆర్‌కు మద్దతిస్తాం: నితీశ్‌
పాట్నా: దేశమంతా ఎన్నార్సీ అవసరం లేదని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగదని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎన్పీఆర్‌ పదేండ్ల కిందట తాము బీహార్‌లో చేపట్టిన ప్రాజెక్టును పోలి ఉన్నదని చెప్పారు. అందుకే దానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు. ఎన్పీఆర్‌, జనగణన ప్రక్రియ దాదాపు ఒకేవిధంగా ఉంటాయని, ఎన్పీఆర్‌లో ప్రజల నుంచి కొన్ని అదనపు వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈసారి కులాల ఆధారంగా జనగణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles