మలేరియాపై ఒడిశా యుద్ధం!


Thu,September 12, 2019 02:19 AM

Odisha Aims to Become First Malaria free State in Five Years

- మారుమూల గ్రామాల్లో సేవలు
- రెండేండ్లుగా ప్రత్యేక కార్యాచరణ
- మలేరియా కేసులు గణనీయంగా తగ్గుముఖం


భువనేశ్వర్: మలేరియా మహమ్మారిపై పోరాటంలో ఒడిశా ప్రభుత్వం విజయం సాధించింది. ఎలాంటి ప్రయాణ మార్గాలు లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఓ ప్రత్యేక కార్యక్రమంతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. ఫలితంగా ఆయా గ్రామాల్లో గత రెండేండ్లుగా మలేరియా బారినపడి ఒక్కరు కూడా మృతి చెందలేదు. ఒడిశాలోని కందమాల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. అక్కడి గ్రామాలను చేరుకోవాలంటే కాలి నడకన ప్రయాణించాల్సిందే. వాగులు, వంకలు దాటడంతోపాటు కొండలు, గుట్టలు ఎక్కిదిగాల్సి ఉంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేక ఈ ప్రాంతవాసులు పలు రోగాల బారిన పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో విజృంభించే మలేరియా, డెంగి, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి వ్యాధుల కారణంగా మృత్యువాతపడేవారు. ఈ నేపథ్యంలో బాహ్యప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని ఈ ప్రాంతంలో మలేరియాను పూర్తిగా నియంత్రించేందుకు ఒడిశా ప్రభుత్వం రెండేండ్ల కిందట ఈ గ్రామాల్లో డామన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇందులో భాగంగా అత్యంత ప్రభావితమైన 320 గ్రామాలను ఎంపిక చేసింది. సీజనల్ వ్యాధులు వ్యాపించే వర్షాకాలంలో వైద్య సిబ్బంది ప్రయాసలతో కాలినడకన ఆయా గ్రామాలకు వెళ్లారు. స్థానిక ఔత్సాహికుల సహాయంతో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వారికి అవసరమైన మందులను సమకూర్చారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో రెండేండ్లలో మలేరియా కేసులను చాలా వరకు నియంత్రించినట్లు కందమాల్ జిల్లా వైద్య కన్సల్టెంట్ కుముద్ చంద్ర సాహు తెలిపారు. 2017తో పోల్చితే 2018లో మలేరియా కేసులను 90 శాతం నియంత్రించాం. గత ఏడాదికంటే ఈ ఏడాది 70శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి అని వివరించారు.

194
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles