అలాగైతే.. కాంగ్రెస్ 24 గంటల్లో చీలుతుంది


Tue,July 23, 2019 01:42 AM

Non Gandhi chief will cause Congress to split within 24 hours Natwar Singh

- గాంధీ కుటుంబానికి చెందనివాళ్లు పార్టీని నడిపించలేరు:నట్వర్ సింగ్

న్యూఢిల్లీ, జూలై 22: గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ అధ్యక్షులైతే, కాంగ్రెస్ 24 గంటల్లో చీలడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక వైపు మొగ్గు చూపుతున్నారు. కష్టకాలంలో ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు ఎంపీ అభిజిత్ ముఖర్జీ, సీనియర్ నేత అనిల్ శాస్త్రి ఇప్పటికే సూచించగా.. వారితో నట్వర్ సింగ్ గొంతుకలిపారు. పార్టీని నడిపే సత్తా ప్రియాంకకు ఉన్నదని, యూపీ ఘటన ద్వారా ఇది స్పష్టమైందన్నారు. పార్టీ కొత్త సారథి గాంధీ కుటుంబం నుంచి ఉండబోరన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే కాంగ్రెస్ చీలే ప్రమాదం ఉన్నదని నట్వర్ సింగ్ హెచ్చరించారు.

180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles