యార్ దిల్‌దార్ ఇమ్రాన్‌ఖాన్ థాంక్యూ

Sun,November 10, 2019 01:49 AM

-కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభంపై సిద్ధూ వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబర్ 9: పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించాలన్న సిక్కుల కోరిక నెరవేరినందుకు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ సంతోషం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించాలని సిక్కులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారని, కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించడం ద్వారా వారి కోరిక నెరవేరిందని, ఇందుకుగాను పాక్ ప్రధాని, యార్ దిల్‌దార్ (స్నేహితుడు) ఇమ్రాన్‌ఖాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. శనివారం కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కౌగిలింత నేడు ఫలించింది అని తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు పాక్‌కు వెళ్లిన సిద్ధూ ఆ దేశ అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్వామర్ జావెద్ బజ్వాను కౌగిలించుకున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దేశ విభజన జరిగిన తర్వాత తొలిసారిగా భారత్, పాక్ మధ్య ఉన్న కంచె తెగిపోయింది. ఇప్పుడు సరిహద్దును తెరువండి.. హృదయాన్ని తెరువండి అని వ్యాఖ్యానించారు.

266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles