అయోధ్యలో మినీ దీపావళి

Sun,November 10, 2019 01:32 AM

అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పును పురస్కరించుకొని అయోధ్య జిల్లాలోని సదత్‌గంజ్‌ ప్రాంత ప్రజలు సంబురాలు చేసుకున్నారు. కొవ్వొత్తులను వెలిగించి, పటాకులను కాల్చారు. ‘భారత్‌ మాతాకీ జై, వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ‘సుప్రీంకోర్టు తీర్పును చూస్తుంటే రాముడు మళ్లీ జన్మించినట్లు కనిపిస్తున్నది. అందుకే మేము మినీ దీపావళిని జరుపుకుంటున్నాం’ అని టీచర్లు గజేంద్ర త్రిపాఠి, రాఘవేంద్ర త్రిపాఠి చెప్పారు. ఎస్పీ సింగ్‌ అనే స్థానికుడు మాట్లాడుతూ సదత్‌గంజ్‌ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, తమ చుట్టాలు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. రాధా అనే మహిళ స్పందిస్తూ తీర్పు తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందన్నారు.

704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles