నల్లకోళ్లతో కోట్ల కుంభకోణం!

Wed,September 18, 2019 03:02 AM

-మహారాష్ట్రలో రైతులను ముంచిన పౌల్ట్రీ కంపెనీ
-కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పేరుతో రూ. 550 కోట్ల సేకరణ
-బాధితుల ఫిర్యాదుతో కంపెనీ అధికారుల అరెస్ట్

పుణె, సెప్టెంబర్ 17: అవి చూడటానికి నల్లగా ఉండే కోళ్లు. కానీ, వాటినే ఎరగా వేసి మహారాష్ట్రలో కొన్ని వేల మంది రైతులను మోసం చేసింది ఓ పౌల్ట్రీ కంపెనీ. డిపాజిట్ల పేరుతో అమాయకులైన రైతుల నుంచి కోట్ల్ల రూపాయలు కూడా దండుకుంది. చివరికి మోసాన్ని గ్రహించిన రైతులు పోలీసులను ఆశ్రయించి కేసులు పెట్టారు. దీంతో సంగ్లీ జిల్లా కేంద్రంగా నడుస్తున్న మహారయత్ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన కడక్‌నాథ్ కోళ్లకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉన్నది. కిలో కడక్‌నాథ్ కోడి మాంసం(కోడిలాగే మాంసం కూడా నల్లగా ఉంటుంది) రూ. 900 వరకు ఉంటుంది.

అప్పుడే పొదుగబడిన కోడి పిల్లలను తాము ఇస్తామని, వాటిని పెంచి తమకు విక్రయిస్తే, ఒక్కో కోడికి రూ. 600 నుంచి రూ. 1200 చొప్పున చెల్లిస్తామని మహారయత్ సంస్థ చెప్పింది. ఒక్కో కోడి గుడ్డుకు రూ. 20 నుంచి రూ. 60 చొప్పున చెల్లిస్తామని ఆశ పెట్టింది. మహారాష్ర్టకు చెందిన దాదాపు 10 వేలమంది రైతులు ఈ పథకంలో చేరి, రూ. 550 కోట్లను చెల్లించినట్టు ప్రహార్ జనశక్తి పార్టీ సంగ్లీ జిల్లా నాయకుడు సునీల్ సుతార్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో విచారణ చేయించాలని స్వాభిమాని షెట్కారీ సంఘటన నాయకుడు రాజు శెట్టి డిమాండ్ చేశారు.

6658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles