‘గగన్‌యాన్‌'కు డీఆర్డీవో సహకారం

Wed,September 18, 2019 02:03 AM

- పలు ఒప్పందాలు కుదుర్చుకున్న ఇస్రో


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్‌' మిషన్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక సహకారం నిమిత్తం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. అంతరిక్షంలో తీసుకునే ఆహారం, వ్యోమగాముల ఆరోగ్య పర్యవేక్షణ, అత్యవసర ప్రాణాధార కిట్‌, రేడియేషన్‌ నుంచి రక్షణ, క్రూ మాడ్యూల్‌ రికవరీ ప్యారాచూట్స్‌ వంటి అంశాల్లో ఇస్రోకు డీఆర్డీవో సహకారం అందించనుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ నేతృత్వంలోని ఇస్రో శాస్త్రవేత్తల బృందం పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు వివరించింది. డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, డైరెక్టర్‌ జనరల్‌ (లైఫ్‌ సైస్సెస్‌) డాక్టర్‌ ఏకే సింగ్‌ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయని తెలిపింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రోకు అవసరమైన సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి తెలిపారు.

226
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles