రూపాయికే.. రక్త పరీక్ష


Wed,August 14, 2019 01:42 AM

IIT Kharagpur researchers develop low cost blood test device

-ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ
కోల్‌కతా: ఏ రోగ నిర్ధారణకైనా రక్త పరీక్ష తప్పనిసరి. ఇకపై దీని కోసం వందలు, వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అతి చౌకగా.. అది కూడా రూపాయి లేదా అంతకన్నా తక్కువకే రక్త పరీక్ష నిర్వహించే పరికరాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు రూపొందించారు. ఒక రక్తపు బొట్టుతో అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ సుమన్‌ చక్రవర్తి తెలిపారు. పేపర్‌ స్ట్రిప్‌ మాత్రమే అవసరమయ్యే ఈ పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేస్తే చాలని, పరీక్ష ఫలితాలు, విశ్లేషణలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇమేజింగ్‌ కోసం ఎల్‌ఈడీ లైట్‌ అవసరమవుతుందన్నారు. ఈ పరికరాన్ని చాలా సులువుగా వినియోగించవచ్చని, దీన్ని వాణిజ్యపరంగా తయారు చేస్తే రక్తపరీక్ష ఖర్చు రూపాయిలోపే ఉంటుందని వివరించారు. ఈ పరికరంతో రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్‌ స్థాయిలపై పలు వాతావరణ పరిస్థితుల్లో పరీక్షలు జరుపగా కచ్చితమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

1855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles