సింఘాల్‌ రూపకర్త.. అద్వానీ రథసారథి!

Sun,November 10, 2019 01:36 AM

న్యూఢిల్లీ: 1990 దశకంలో దేశ రాజకీయాల్లో బీజేపీని ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చేలా చేసిన రామ జన్మభూమి ఉద్యమంలో రామ జన్మభూమి న్యాస్‌ అధిపతి రామచంద్ర పరమహంస, విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కే అద్వానీ కీలక పాత్ర పోషించారు. పరమహంస ఉద్యమానికి ఊతమివ్వగా, సింఘాల్‌ నిర్మాత, రూపకర్తగా వ్యవహరించారు. అద్వానీ రథ సారథిగా మారి రామ జన్మభూమి ఉద్యమాన్ని జన బాహుళ్యంలోకి బలంగా తీసుకెళ్లారు. 1934లో పరమహంస రామ జన్మభూమి ఉద్యమానికి అంకురార్పణ చేశారు. భారత్‌కి స్వాతంత్య్రం వచ్చాక, 1949లో అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆయన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.


ఆ తర్వాత అక్కడ మందిర నిర్మాణాన్ని చేపట్టాలన్న ఉద్యమాన్ని సింఘాల్‌ ‘ధరవ్‌ు సంసద్‌' పేరుతో మరింత ముందుకు తీసుకెళ్లారు. 1980 దశకంలో బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్న ఎల్‌ కే అద్వానీ రామ జన్మభూమి ఉద్యమంలో భాగస్థులు కావడంతో ఈ ఉద్యమం రాజకీయరంగు పులుముకొని మరింత ప్రజాదరణ పొందింది. 1989లో బీజేపీ తన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రామజన్మభూమి అంశాన్ని చేర్చడంలో సింఘాల్‌ ప్రముఖ పాత్ర పోషించారు. అద్వానీ నేతృత్వంలోనే ఈ నిర్ణయం జరిగింది. 1986లో బీజేపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన అద్వానీ పార్లమెంటులో రెండు స్థానాలకు పరిమితమైన ఆ పార్టీని 85 స్థానాల్ని కైవసం చేసుకునేలా కృషి చేశారు. 1990లో అద్వానీ చేపట్టిన రామ రథయాత్ర విశేషాధారణ పొందింది. ఇలా అయోధ్య అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా బీజేపీ వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది.

138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles