గోపాల్‌సింగ్‌కే.. రాముడ్ని పూజించే హక్కు

Sun,November 10, 2019 01:18 AM

- చనిపోయిన 33 ఏండ్ల తర్వాత వెలువడిన తీర్పు


న్యూఢిల్లీ: వివాదస్పద స్థలంలోని రాముడి విగ్రహానికి పూజించే హక్కు తొలి పిటిషనర్‌ గోపాల్‌ సింగ్‌ విశారద్‌కే ఉన్నదని శనివారం సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆయన చనిపోయిన 33 ఏండ్ల తర్వాత ఈ తీర్పు వెలువడటం గమనార్హం. 1949లో హిందూ మహాసభ ఆధ్వర్యంలో వివాదాస్పద బాబ్రీ మసీదులో హనుమంత సమేత రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. నాటి నుంచి గోపాల్‌ సింగ్‌ విశారద్‌ ప్రతి రోజు అక్కడికి వచ్చి పూజలు చేసేవారు. 1950 జనవరి 14న సెక్యూరిటీ అధికారులు ఆయన ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దీంతో రాముడ్ని పూజించే తన వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ ఫైజాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన సివిల్‌ కోర్టు జడ్జి విగ్రహాల తొలగింపుపై స్టే విధించారు. ఆ తర్వాత వీటి విచారణ అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యింది. 1986లో గోపాల్‌ సింగ్‌ చనిపోవడంతో ఆయన కుమారుడు రాజేంద్ర సింగ్‌ న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఏండ్ల నాటి అయోధ్య కేసులపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడ పూజించే హక్కు తొలి వాదికే ఉన్నదని స్పష్టం చేసింది. తీర్పుపట్ల రాజేంద్ర సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.

149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles