అవిశ్రాంత న్యాయ కోవిదుడు పరాశరన్‌

Sun,November 10, 2019 02:05 AM

న్యూఢిల్లీ: మాజీ అటార్నీ జనరల్‌ కే పరాశరన్‌ (93) పరిచయం అక్కర్లేని పేరు. అయోధ్య కేసులో హిందూ సంస్థల తరఫున వాదించిన ఈ న్యాయకోవిదుడు.. సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టినప్పటి నుంచి అవిశ్రాంతంగా పని చేశారు. ఎనిమిది నెలల పాటు విశ్రాంతికి చోటివ్వలేదు. దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో హోరాహోరీ వాదనలకు ప్రత్యక్ష సాక్షి. ప్రతి రోజూ 10.30 గంటలకు కేసు విచారణ కోసం న్యాయస్థానంలో ప్రత్యక్షమయ్యే పరాశరన్‌ సాయంత్రం నాలుగు/ఐదు గంటలకు వాదనలు ముగించేవారు. తన వాదనలకు ముందు కేసును క్షుణ్ణంగా అధ్యయనం జరిపేవారు. పరాశరన్‌కు సహకరించిన న్యాయవాదుల బృందంలో పీవీ యోగేశ్వరన్‌, అనిరుద్ధ్‌ శర్మ, శ్రీధర్‌ పొట్టరాజు, అదితి దానీ, అశ్వినీ కుమార్‌ డీఎస్‌, భక్తి వర్ధన్‌ సింగ్‌ ఉన్నారు. ముదిమి వయస్సులోనూ పరాశరన్‌ శక్తి సామర్థ్యాలు, వాదనాపటిమను చూసి ఆయన న్యాయవాదుల బృందం ఆశ్చర్యపోయింది. ముస్లిం సంస్థల తరపు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ను తన వాద నా ప్రతిభతో, విస్తృత అంశాలతో కూడిన సబ్మిషన్లతో ఢీకొట్టారు. గత 40 రోజులుగా విచారణలో ఏనాడూ పరాశరన్‌ సహనం కోల్పోలేదు.రాజీవ్‌ ధావన్‌ కొన్ని పత్రాలను చించివేసినా నిబ్బరం కోల్పోలేదు. గత నెల 16న రాజ్యాంగ ధర్మాసనం వాదనలు ముగిసిన తర్వాత కోర్టు బయట రాజీవ్‌ ధావన్‌ను కలుసుకునేందుకు 15 నిమిషాలు వేచి ఉన్నారు. కోర్టులో కక్షిదారుల తరఫున పోరాడినా బయట తమ మధ్య ఘర్షణ లేదని దేశానికి చాటి చెప్పారు.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles