వైద్యులపై దాడి చేస్తే పదేండ్ల జైలు


Wed,August 14, 2019 01:43 AM

Draft Bill Proposing Jail For Hurting Doctors On Duty Ready

-రూ.10 లక్షల వరకు జరిమానా ముసాయిదా బిల్లు సిద్ధం
న్యూఢిల్లీ: దవాఖానల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై దాడి చేసిన వారిపై మూడేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఈ ముసాయిదాను త్వరలో బహిర్గతం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం తెలిపారు. దవాఖానలో హింసకు పాల్పడినా, విధ్వంసానికి పాల్పడినా నిందితులకు ఆరు నెలల నుంచి ఐదేండ్ల జైలుశిక్షతోపాటు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలని, దాడిలో దెబ్బతిన్న దవాఖాన ఆస్తి విలువకు రెండు రెట్లు పరిహారం చెల్లించాలన్న నిబంధనను కూడా ముసాయిదాలో చేర్చినట్లు సమాచారం. దవాఖానల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై దాడులు నిషేధించాలని డాక్టర్ల నుంచి సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ ఉన్నదని హర్షవర్ధన్‌ గుర్తు చేశారు.

637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles