జ్యుడీషియల్ కస్టడీకి శివకుమార్

Wed,September 18, 2019 02:58 AM

ఆదేశించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: మనీల్యాండరింగ్ కేసులో అరస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఢిల్లీలోని స్థానిక కోర్టు ఆదేశించింది. శివకుమార్‌ను తొలుత దవాఖానకు తీసుకెళ్లండి. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నదని డాక్టర్లు చెబితే తీహార్ జైలుకు తరలించండి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహార్ ఆదేశించారు. ఒకవేళ నిందితుడు దవాఖానలో చేరితే అతడికి తీహార్ జైలు సూపరింటెండెంట్ భద్రత కల్పించాలని, డాక్టర్లు డిశ్చార్జి చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని సూచించారు. మంగళవారం విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శివకుమార్ విచారణ అసంపూర్ణంగా ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోనూ విచారించేందుకు అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో శివకుమార్ తరఫు న్యాయవాది కలుగజేసుకుంటూ ఆయన ఆరోగ్యం క్షీణించిందని, గుండెపోటు వచ్చే సూచనలు ఉన్నాయన్న డాకర్ల నివేదికను కోర్టు ముందు ఉంచుతున్నామన్నారు. బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. శివకుమార్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు.

240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles