భూమికి భారం.. చిదంబరం


Wed,August 14, 2019 01:24 AM

Chidambaram only a burden on Earth says TN CM Palaniswami

-తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
సేలం, ఆగస్టు 13: 370వ అధికరణాన్ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతునిచ్చిన తమ పార్టీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం తప్పుబట్టడంపై అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం కే పళనిస్వామి ధ్వజమెత్తారు. ఆయన భూమికే భారం అని వ్యాఖ్యానించారు. చిదంబరం వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదన్నారు. అన్నాడీఎంకే ప్రతిఘటించకుంటే తమిళనాడును కూడా కేంద్రం కేంద్రపాలితప్రాంతంగా మార్చేస్తుందని ఆదివారం చిదంబరం చేసిన వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. చిదంబరానికి ఆయన సొంత ప్రయోజనాలే తప్ప దేశ ప్రయోజనాలు పట్టవన్నారు. ఎంతోకాలంగా రాజకీయాల్లో ఉన్న చిదంబరం రాష్ర్టానికి అందించిన సేవలేమిటో చెప్పాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిధులు తీసుకొచ్చారా? కావేరీ, ముళ్ల పెరియార్‌ వివాదాలను పరిష్కరించారా? అని ప్రశ్నించారు.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles