విక్రమ్‌పై కొనసాగుతున్న అనిశ్చితి!

Wed,September 18, 2019 03:05 AM

-విడుదల కాని నాసా ఫొటోలు
-చంద్రయాన్ -2లో అండగా నిలిచిన భారతీయులకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 తాలూకు విక్రవ్‌ు ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడిపై హార్డ్ ల్యాండ్ అయిన విక్రవ్‌ు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఇదివరకే ప్రకటించింది. విక్రవ్‌ు దిగినట్టుగా భావిస్తున్న ప్రాంతంపైకి తాము ప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌ఓ) ఈ నెల 17న రానున్నట్టు గతంలో తెలిపింది. ఈ సమయంలో విక్రవ్‌ు ఫొటోలు తీయడానికి ఎల్‌ఆర్‌ఓ ప్రయత్నిస్తుందని నాసా పేర్కొంది. ఈ ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని కూడా నాసా వెల్లడించింది. అయితే, మంగళవారం అర్థరాత్రి దాటేవరకూ విక్రవ్‌ు ల్యాండర్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను నాసా విడుదల చేయలేదు. మరోవైపు చంద్రయాన్-2 మిషన్‌లో తమ వెన్నంటి ఉన్న భారతీయులకు ఇస్రో మంగళవారం ధన్యవాదాలు తెలిపింది. భారతీయుల ఆకాంక్షలతో, కలలతో స్ఫూర్తి పొందుతూ మేము మున్ముందుకు సాగుతాం. అత్యున్నత లక్ష్యాలను సాధించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతలు అని ఇస్రో ట్వీట్ చేసింది.

విక్రవ్‌ు కనిపించిందా?:బ్రాడ్ పిట్

హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ విక్రవ్‌ు గురించి ఆరా తీశారు. ల్యాండర్‌ను చూశారా? అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న నిక్ హేగ్‌ను అడిగారు. దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని ఆమె సమాధానమిచ్చారు. ఆడ్ ఆస్ట్రా సినిమా ప్రచారంలో భాగంగా వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయానికి బ్రాడ్‌పిట్ వచ్చి అక్కడి నుంచి ఐఎస్‌ఎస్‌కి వీడియో కాల్ చేశారు.

1101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles