సీబీఐ కార్యాచరణ నిబంధనల్లో మార్పులు!


Thu,September 12, 2019 02:15 AM

CBI to change standard operating procedures in conformity with amendments in laws

- 10 నెలలుగా కొనసాగుతున్న కసరత్తు
న్యూఢిల్లీ: కేసుల దర్యాప్తులో అనుసరించే కార్యాచరణ నిబంధనలను దాదాపు 14 ఏండ్ల తర్వాత ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా సవరించేందుకు సీబీఐ సిద్ధమైంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ధ్రువీకరిస్తూ ఈ నిబంధనల్లో మార్పులు చేపట్టనున్నది. సీబీఐ క్రైమ్ మాన్యువల్‌లో మార్పులు, చేర్పుల కోసం పది నెలలుగా కసరత్తు చేస్తున్న ఆ సంస్థ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా సారథ్యంలోని బృందం.. వాటిని త్వరలోనే ఖరారు చేయనున్నదని అధికారులు తెలిపారు. సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సీబీఐ తన కార్యాచరణ నిబంధనలను చివరిగా 2005లో సవరించింది. సైబర్ నేరాలు కూడా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తిగా నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles