అసెంబ్లీ ఎదుట బీజేపీ నిరసన


Thu,July 11, 2019 02:21 AM

BJP turns up heat demands CM to tender resignation

బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినందున సంకీర్ణ సర్కార్ మైనారిటీలో పడిపోయిందని, అందువల్ల సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో రాష్ట్ర అసెంబ్లీ ఎదుట బీజేపీ ధర్నాకు దిగింది. ఈ ఆందోళనలో మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్పతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సీఎం వెంటనే గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప మాట్లాడుతూ, కుమారస్వామి వెంటనే గద్దె దిగి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల న్నారు. 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మెజారిటీ లేకుండా మీరు సభనెలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. మీరు (కుమారస్వామి) స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేదా మీ తండ్రి (దేవెగౌడ) అయినా మీకు రాజీనా మా చేయాలని సలహా ఇవ్వాలి అని అన్నా రు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కావ డం లేదన్నారు. రాజీనామాలు నిబంధనల ప్రకారం లేకపోతే.. ఎమ్మెల్యేలు మళ్లీ సమర్పిస్తారన్నారు. కర్ణాటకలో ఏర్పడిన సంక్షోభంపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం పతనం అంచున నిలిచినందున గవర్నర్ బలపరీక్ష జరిపినా తాము ఎదుర్కొంటామన్నారు. అధికార పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో తమ సభ్యుల సంఖ్య 107 అని సదానంద వివరించారు.

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles